AP Corona Cases: ఏపీలో కొత్తగా 1869 కరోనా కేసులు.. ఆ జిల్లాలో కలవరపెడుతున్న మరణాలు

|

Aug 11, 2021 | 3:52 PM

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 71,030 కరోనా టెస్టులు చేయగా 1,869 మందికి వైరస్ సోకినట్లు తేలింది...

AP Corona Cases: ఏపీలో కొత్తగా 1869 కరోనా కేసులు.. ఆ జిల్లాలో కలవరపెడుతున్న మరణాలు
Ap Corona
Follow us on

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 71,030 కరోనా టెస్టులు చేయగా 1,869 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య  1987051కు చేరింది. కొత్తగా 18 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13582కు చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 2,316 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఫలితంగా మొత్తం రికవరీల సంఖ్య  1955052కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18417 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కోవిడ్ వల్ల కొత్తగా చిత్తూర్ జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, అనంతపూర్, తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

జిల్లాలవారీగా కేసుల వివరాలను దిగువన చూడండి

కరోనా సమాచారం ఇక నుండి మీ చేతుల్లోనే:

● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి.
● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు
● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు
● https://esanjeevani.com/ వెబ్ సైట్ ద్వా రా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు.
● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. క్రింద లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.
https://play.google.com/store/apps/details?id=com.entrolabs.apcovid19

Also Read:సీఎం జగన్ సంచలనం.. భవిష్యత్‌లో కుటుంబానికి కాకుండా ప్రతి వ్యక్తికి ‘ఆరోగ్య శ్రీ’ కార్డు

యువతి అనుమానాస్పద మృతి.. ఇంట్లో నల్లటి మరకలు… రంగంలోకి డీఎస్పీ ప్రశాంతి