AP Corona Cases: ఏపీలో కొత్తగా 3,464 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

|

Jul 02, 2021 | 5:47 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 93,759 మంది శాంపిల్స్ టెస్ట్ చేయగా 3,464 కొత్త కేసులు వెలుగుచూశాయి. వైరస్ కారణంగా...

AP Corona Cases: ఏపీలో కొత్తగా 3,464 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
Ap Corona
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 93,759 మంది శాంపిల్స్ టెస్ట్ చేయగా 3,464 కొత్త కేసులు వెలుగుచూశాయి. వైరస్ కారణంగా మరో 35 మంది మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి 4,284 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 37,323 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ప్రభుత్వం బులిటెన్‌లో వెల్లడించింది.  కరోనా  వల్ల కొత్తగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విజయనగరంలో ఇద్దరు, కడప, కర్నూలు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు.

దేశంలో కరోనా వివరాలు ఇలా

ఇక దేశంలో కొత్తగా మరో 46,617 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య  3,04,58,251 కు చేరింది.  25 రోజులుగా పాజిటివిటీ రేటు 5శాతానికి దిగువనే ఉండటం ఊరట కలిగించే విషయం.  దేశంలో కరోనా కారణంగా కొత్తగా  24 గంటల వ్యవధిలో మరో 835 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,00312కు చేరింది. ఇక ఇదే సమయంలో 59,384 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం  2,95,48,302 మంది కరోనాను జయించారు. రికవరీ రేటు 97.01శాతానికి పెరిగింది. కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,09,637 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు.

 

Also Read:  వెంటాడిన విధి.. ఆ తల్లి తన ముద్దుల బిడ్డను కొబ్బరి చెట్టు కింద పడుకోబెట్టింది.. అంతలోనే

‘అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలి’.. రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్స్