కరోనాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. ఈ వైరస్ రాని వ్యక్తి ఉండకపోవచ్చు..

| Edited By:

Jul 16, 2020 | 1:40 PM

కరోనా వైరస్‌ మహమ్మారి గురించి ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. భవిష్యత్తులో కరోనా రాని వ్యక్తి ఉండకపోవచ్చు. కోవిడ్‌పై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముందు జాగ్రత్తలు తీసుకుంటే 85 శాతం..

కరోనాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. ఈ వైరస్ రాని వ్యక్తి ఉండకపోవచ్చు..
Follow us on

కరోనా వైరస్‌ మహమ్మారి గురించి ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. భవిష్యత్తులో కరోనా రాని వ్యక్తి ఉండకపోవచ్చు. కోవిడ్‌పై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముందు జాగ్రత్తలు తీసుకుంటే 85 శాతం ఇంటి దగ్గరే కరోనా నుంచి కోలుకోవచ్చు. పొరుగు రాష్ట్రాలు సరిహద్దులు తెరిచారు. ఎవరి రాకపోకలను మనం కట్టడి చేయలేం. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి. కరోనా లక్షణాలు ఉంటే ఏం చేయాలన్నదానిపై అవగాహన పెంచుకోవాలి. అలాగే ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నానని పేర్కొన్నారు సీఎం జగన్.

అలాగే ఆరోగ్య శ్రీ సేవలను మరో ఆరు జిల్లాలకు విస్తరిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. ప్రస్తుతం విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. కరోనాను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీనే. వైద్యం కోసం ఎవరూ అప్పుల పాలు కాకూడదన్నారు. కోటీ 42 లక్షల మందికి ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేశామన్నారు. ఇక నాడు-నేడుతో ఆస్పత్రుల రూపు రేకలు మారుస్తామని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో ఆరోగ్య శ్రీ అదనపు సేవలు వర్తింపు చేస్తామని తెలిపారు. ఇక డబ్ల్యూహెచ్‌వో సూచించిన మందులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇస్తున్నామని చెప్పారు సీఎం.

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అటు పలువురు రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులు కూడా ఈ కరోనా బారిన పడుతున్నారు. ఇక ఏపీలో ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 35,451కి చేరింది. అలాగే ఇప్పటివరకూ 452 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం 16,621 క‌రోనా యాక్టివ్ కేసులు ఉండగా, 18,378 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Read More: 

తిరుమలలో అర్చకులకు కరోనా.. టీటీడీ ఛైర్మన్ అత్యవసర భేటీ..

దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు..

మరో తెలంగాణ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..