తిరుమలలో అర్చకులకు కరోనా.. టీటీడీ ఛైర్మన్ అత్యవసర భేటీ..

తిరుపతిలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో తిరుమల దేవస్థానంలోని అర్చకులతో సమావేశమయ్యారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. కరోనా వల్ల అర్చకులు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని సుబ్బారెడ్డి భరోసా ఇచ్చారు. అరవై ఏళ్ళు దాటిన అర్చకులు కావాలంటే కొద్ది రోజులు..

తిరుమలలో అర్చకులకు కరోనా.. టీటీడీ ఛైర్మన్ అత్యవసర భేటీ..
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2020 | 12:33 PM

తిరుపతిలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో తిరుమల దేవస్థానంలోని అర్చకులతో సమావేశమయ్యారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. కరోనా వల్ల అర్చకులు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని సుబ్బారెడ్డి భరోసా ఇచ్చారు. అరవై ఏళ్ళు దాటిన అర్చకులు కావాలంటే కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అవసరమైతే తిరుపతిలోని దేవాలయాల నుంచి డిప్యుటేషన్‌పై అర్చకులని తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ.. భక్తుల వల్ల తమకు ఎలాంటి కరోనా రాలేదని పేర్కొన్నారు. తాజాగా ఈరోజు ఏడుగురికి కరోనా పాజిటివ్ రావడంతో.. ఇప్పటివరకూ మొత్తం 14 మంది అర్చకులకు కరోనా సోకిందని చెప్పారు. అందులో వయసుతో సంబంధం లేకుండా 25 ఏళ్ల అర్చకులు కూడా ఉన్నారని వెల్లడించారు వేణుగోపాల దీక్షితులు. అర్చకులకు కరోనా ఎలా సోకుతుందో అర్థం కావడం లేదు. అర్చకులెవరూ భక్తులతో ఇంటరాక్ట్ కావడం లేదని వేనుగోపాల దీక్షితులు తెలిపారు.

Read More: 

దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు..

మరో తెలంగాణ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..

సమంత విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన రష్మిక..