దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు..

దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఈ రోజు భూమి కంపించింది. ఈ రోజు ఉదయం గుజరాత్, అసోం, హిమాచల్ ప్రదేశ్‌లలో భూ కంపం సంభవించింది. ఇప్పటికే కరోనా వైరస్, తీవ్ర వర్షాల కారణంగా ఆందోళన చెందుతున్న ప్రజలు..

దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు..
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2020 | 12:04 PM

దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఈ రోజు భూమి కంపించింది. ఈ రోజు ఉదయం గుజరాత్, అసోం, హిమాచల్ ప్రదేశ్‌లలో భూ కంపం సంభవించింది. ఇప్పటికే కరోనా వైరస్, తీవ్ర వర్షాల కారణంగా ఆందోళన చెందుతున్న ప్రజలు.. ఈ వరుస భూకంపాలతో మరింత భయాందోళనకు గురవుతున్నారు.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గురువారం ఉదయం 7.40 గంటలకు భూమి కంపించింది. మాగ్నిట్యూడ్‌పై తీవ్రత 4.5గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. ఇక ఈశాన్య రాష్ట్రం అసోంలో ఈ రోజు ఉదయం 7.57 గంటలకు భూకంపం సంభవించగా.. మాగ్నిట్యూడ్‌పై తీవ్రత 4.1గా నమోదైంది. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో కూడా ఈ రోజు భూ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున 4.47 గంటల సమయంలో స్వల్పంగా భూ కంపం ఏర్పడింది. మాగ్నిట్యూడ్‌పై తీవ్రత 2.3గా ఉంది.

అయితే ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదని పేర్కొన్నారు అధికారులు. ఈశాన్య రాష్ట్రాల్లో గత కొద్ది రాష్ట్రాల్లో తరచూ భూ కంపాలు సంభవిస్తున్నాయి. ఇక గుజరాత్‌లో కూడా మూడు రోజుల క్రితమే భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే.

Read More: 

మరో తెలంగాణ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..

సమంత విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన రష్మిక..