‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `నిశ్శబ్దం`. ఈ చిత్రంలో అనుష్క మాట్లాడలేని ‘సాక్షి’ అనే అమ్మాయి పాత్రలో నటించింది. సరిగ్గా ఈ సినిమాను విడుదల చేద్దాం అన్న సమయానికి దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్‌కు నోచుకోలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందోనని ప్రచారం మొదలైంది. ఇటీవలే ఓటీటీ రిలీజ్ చేయడంపై నిశ్శబ్దం మేకర్స్ స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మా చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయమని, థియేటర్‌లోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
అయితే తాజాగా నాని, సుధీర్ బాబు కలిసి నటించిన వి సినిమా అమేజాన్ ఓటీటీలో రిలీజ్ కావడంతో.. మళ్లీ నిశ్శబ్దం సినిమా రిలీజ్‌పై పలు ప్రచారాలు ఊపందుకున్నాయి. త్వరలోనే నిశ్శబ్దం సినిమా కూడా ఓటీటీలో విడుదల కాబోతుందని, అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రానికి భారీ ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. కాగా నిశ్శబ్దం సినిమాని యంగ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ దర్మకత్వం వహించగా, టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి కోన వెంకట్ నిర్మించారు.
Read More:
తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు!