Lockdown In Andhrapradesh: ఏపీలో క‌ర్ఫ్యూ గ‌డువు పెరిగిన వేళ‌.. ఈ-పాస్‌ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి..

|

May 18, 2021 | 8:34 AM

Lockdown In Andhrapradesh: దేశంలోని చాలా రాష్ట్రాలు క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్ ఒక్క‌టే మార్గ‌మ‌నే ఆలోచ‌న‌కు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే లాక్‌డౌన్‌, క‌ర్ఫ్యూ పేరుతో క‌రోనా వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు...

Lockdown In Andhrapradesh: ఏపీలో క‌ర్ఫ్యూ గ‌డువు పెరిగిన వేళ‌.. ఈ-పాస్‌ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి..
Ap Lockdown E Pass
Follow us on

Lockdown In Andhrapradesh: దేశంలోని చాలా రాష్ట్రాలు క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్ ఒక్క‌టే మార్గ‌మ‌నే ఆలోచ‌న‌కు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే లాక్‌డౌన్‌, క‌ర్ఫ్యూ పేరుతో క‌రోనా వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొన్ని స‌డ‌లింపుల‌తో కూడిన క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసింది. నిజానికి ఈ నెల 5 తేదీ నుంచి 18 వ‌ర‌కు విధించిన క‌ర్ఫ్యూను ఏపీ ప్ర‌భుత్వం తాజాగా ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పొడగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా క‌ట్ట‌డిలో మెరుగైన ఫలితాలు కనిపించాలంటే కనీసం నాలుగు వారాల పాటు కర్ఫ్యూ అమల్లో ఉండాల్సిన అవసరం ఉందని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయం, నిబంధనలను గతంలో మాదిరిగానే యథాతథంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో రాష్ట్రాన్ని దాటి వెళ్లే వారు, ఇత‌ర జిల్లాల‌కు వెళ్లే వారికి ఈ – పాస్‌ను అంద‌జేస్తున్నారు. ఇంట్లో ఉండే ఆన్‌లైన్ ద్వారా ఈ పాస్‌ను అప్లై చేసుకోవ‌చ్చు. ఇది వ‌ర‌కే అందుబాటులో ఉన్న ఈ సేవ‌ల గురించి.. క‌ర్ఫ్యూ పొడ‌గించిన నేప‌థ్యంలో మ‌రో సారి తెలుసుందాం.

ఇందులో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసులు తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌రోసారి ఈ పాస్‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలోనే ట్వీట్ చేసిన పోలీసులు.. మెడిక‌ల్ ఎమ‌ర్జ‌న్సీలో భాగంగా ఈ-పాస్ అప్లై చేసుకోవాల‌నుకునే వారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ట్విట్ట‌ర్ హ్యాండిల్‌తో పాటు ఏపీ పోలీస్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాల‌ని కోరారు. ఇక నేరుగా ఈపాస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాల‌నుకుంటే ఇక్క‌డ క్లిక్ చేయండి. దీంతో నేరుగా అప్లికేష‌న్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అనంత‌రం అందులో అవ‌స‌ర‌మైన వివ‌రాలు అందించి పాస్‌ను సొంతం చేసుకోండి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసులు చేసిన ట్వీట్‌..

Also Read: Black Fungus in AP: ఏపీలో బ్లాక్ ఫంగస్ టెన్ష‌న్.. మార్కాపురంలో 6 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

MGNREGA: కరోనా కష్టకాలంలో గ్రామీణులకు ఆసరాగా ‘నరేగా’.. మే నెలలో 1.85 కోట్ల మందికి లబ్ది!

Ministry of Home Affairs Recruitment: క‌స్టోడియ‌న్ ఎన‌మీ ప్రాప‌ర్టీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..