Coronavirus: ఏపీలో కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి.. గత 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

|

Jan 05, 2022 | 8:12 PM

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.  రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.  కాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 32,785 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 434 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది.

Coronavirus: ఏపీలో కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి.. గత 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
Ap Corona
Follow us on
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.  రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.  కాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 32,785 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 434 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది.  అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 68 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. కాగా  నిన్నటి (334)తో పోలిస్తే  నేడు 100 కేసులు అధికంగా నమోదయ్యాయి. ఉపశమనం కలిగించే విషయమేమిటంటే.. ఈ వైరస్‌తో ఎవరూ మృతిచెందలేదు.  కాగా కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 20,78,376కి చేరాయి.  అదేవిధంగా కొవిడ్‌ బారినపడి  14,499గా మృత్యువాత పడ్డారు.  కాగా గడిచిన 24 గంటల్లో  కరోనా నుంచి 102 మంది కోలుకున్నారు. దీంతో ఏపీలో కరోనా రికవరీల సంఖ్య ఇప్పటివరకు 20,62,029కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,848 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
ఒమిక్రాన్‌ కేసులు ఎన్నంటే..

మరోవైపు రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య పెరుగుతోంది. ఇవాళ నాలుగు ఒమిక్రాన్ కేసులు ((Omicron cases in AP)  వెలుగుచూశాయి. దీంతో ఏపీలో మెుత్తం కేసుల సంఖ్య 28కి చేరింది. యూఎస్‌ఏ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, విదేశాల నుంచి వచ్చిన మరో మహిళకు ఒమిక్రాన్‌ పాజిటివ్ గా తేలింది. కాగా దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్‌ వ్యాప్తితో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. మూడో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:

MBBS Admissions: ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. రిజిస్ట్రేషన్‌ ఎలా చేసుకోవాలంటే..

Civil Mains Exam: ఒమిక్రాన్‌ టెన్షన్‌.. సివిల్‌ మెయిన్స్‌ పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీ కీలక ప్రకటన..

AP SSC Exams: పదో తరగతి విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. ఫైనల్‌ ఎగ్జామ్స్‌లో 11 పేపర్లకు బదులు..