Andhra Pradesh Coronavirus Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల పెరుగుదల మరోసారి కలవరానికి గురిచేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 429 కోవిడ్ నిర్ధారణ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వివరాలను గమనిస్తే.. గడిచిన 24 గంటల్లో 30,515 మంది శాంపిల్స్ పరీక్షించగా 429 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదై పాజిటివ్ కేసుల సంఖ్య 20,53,192కు చేరుకుంది. కాగా, గడిచిన ఒక్కరోజు వ్యవధిలో 1,029 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల్లో 20,29,231 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ కోవిడ్ ఆస్పత్రుల్లో 9753 మంది చికిత్స పొందుతున్నారు.
అలాగే కరోనా వైరస్ కారణంగా గడిచిన 24 గంటల్లో నలుగురు మరణించారు. వీరిలో గుంటూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు, చిత్తూరు జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 14,208 కు పెరిగింది. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,84,76,467 నమూనాలను పరీక్షించడం జరిగిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
వివిధ జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..