AP Coronavirus cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ కలవరపెడుతోంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చర్యలు ఎన్నిక చేపట్టినా కొత్త కేసులు నమోదువుతూనే ఉన్నాయి. ఇక దశలో కోవిడ్ కేసులు పూర్తిస్థాయిలో పడిపోయాయి. అయితే, గత కొద్దిరోజులుగా కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
కాగా, గడిచిన 24 గంటల వ్యవధిలో 35,804 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 106 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,90,080కి చేరింది. మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,169 మంది బాధితులు కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. ఇక, ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 57 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,82,137కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 774 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలావుంటే, ఇప్పటివరకు రాష్ట్రంలో 1,40,10,204 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.
మరోవైపు దేశంలోనూ కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 12,286 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌ల నుంచే అత్యధిక శాతం కేసులున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,24,527కు చేరుకుందని ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 91 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,57,248కు చేరుకుందని వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,07,98,921కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 97.07 శాతానికి చేరింది.
ఇదిలావుంటే, యాక్టివ్ కేసుల సంఖ్య 1,68,358గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 1.51 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.41 గా ఉంది. ఇప్పటివరకూ వరకూ 21,76,18,057 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. సోమవారం 7,59,283 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్రాలను కేంద్ర అధికారులు సంప్రదించి సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు వెల్లడించింది. కాగా, మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ సోమవారం నుంచి దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఇవాళ పలు ప్రాంతాల్లో ప్రముఖులతో పాటు 60 ఏళ్లు పైబడినవారు, 45 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి టీకాలను అందిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రవేట్ సెంటర్లను కూడా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వేస్తుండగా, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం నామమాత్రం రూ.250 వసూలు చేస్తున్నారు. అవసరమైన వారు కొవిన్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also… APSSDC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హెటిరో డ్రగ్స్‌లో 80 జాబ్స్.. హైదరాబాద్, వైజాగ్‌లో ఖాళీలు..