AP Corona Positive Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 80,641 నమూనాలను పరీక్షించగా, 2,068 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య19,64,117కు చేరుకున్నాయి. ఇందులో 19,29,565 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆసుపత్రులతో కలిపి 21,198 కరోనా యాక్టీవ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇదిలావుంటే, గడిచిన 24 గంటల్లో ఏపీలో ఏకంగా 22 మంది కోవిడ్19 మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. ప్రకాశం జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి, శ్రీకాకుళం , విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇక, ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,354కి చేరింది.
మరోవైపు, గడచిన 24 గంటల్లో 2,127 మంది కోవిడ్ బారి నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్య వంతులు అయ్యారు. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,44,84,051 నమూనాలను పరీక్షించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కాగా, కరోనా పాజిటివ్ కేసుల నమోదులో విచిత్ర పరిస్థితి నెలకొంది. కొన్ని జిల్లాల్లో ఏమాత్రం పాజిటివ్ కేసుల తీవ్రత తగ్గడంలేదు. అయితే, కర్నూలు, అనంతపురం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో 100కు లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి….