AP Corona: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని నమోదయ్యాయంటే?
Andhra Pradesh Covid-19 cases: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు కాస్త.. మళ్లీ పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. గడిచిన 24 గంటల్లో

Andhra Pradesh Corona Updates
Andhra Pradesh Covid-19 cases: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు కాస్త.. మళ్లీ పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 310 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతోపాటు కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 89,4,044 కి పెరిగింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 7,191 కి చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
కాగా.. గడిచిన 24 గంటల్లో 114 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,84,471 కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,382 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 35,375 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 1,47,71,701 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#COVIDUpdates: 22/03/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,91,149 పాజిటివ్ కేసు లకు గాను *8,81,576 మంది డిశ్చార్జ్ కాగా *7,191 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,382#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/0alrIiezFO
— ArogyaAndhra (@ArogyaAndhra) March 22, 2021
Also Read:
