ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. వైరస్ బారినపడుతున్న బాధితుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 35,582 కరోనా టెస్టులు చేయగా.. 4,228 కేసులు వెలుగుచూశాయి. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,32,892 కు చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల చిత్తూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 7,321కి చేరింది.
24 గంటల వ్యవధిలో 1,483 మంది బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రికవరీల సంఖ్య 8,99,721కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,850 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,54,98,728 నమూనాలను టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. అత్యధికంగా చిత్తూరులో 842, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 48 కేసులు వెలుగుచూశాయి.
#COVIDUpdates: 13/04/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 9,29,997 పాజిటివ్ కేసు లకు గాను
*8,96,826 మంది డిశ్చార్జ్ కాగా
*7,321 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 25,850#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/OIHS6Kvl2K— ArogyaAndhra (@ArogyaAndhra) April 13, 2021
కరోనా కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. వైరస్‌ను లైట్ తీసుకోవద్దని, అలా చేసిన పక్షంలో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
Also Read: ఈ వీడియో చూస్తే నవ్వలేక మీ పొట్ట చెక్కలవుతుంది.. చివర్లో ట్విస్ట్ మాత్రం మిస్ అవ్వొద్దు
పెళ్లి కొడుకు బుల్లెట్ అడిగితే వధువు తరఫువాళ్లు అపాచీ బైక్ ఇచ్చారు.. దీంతో వరుడు బట్టలు విప్పేసి