AP Corona Cases: ఏపీలో మరోసారి పెరిగిన కొత్త కోవిడ్ కేసులు.. ఆ రెండు జిల్లాల్లో మాత్రం..

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు (AP Corona) రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏపీలో గడిచిన 24 గంటల్లో (బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు) 47,884 కరోనా..

AP Corona Cases: ఏపీలో మరోసారి పెరిగిన కొత్త కోవిడ్ కేసులు.. ఆ రెండు జిల్లాల్లో మాత్రం..
Ap Corona

Updated on: Jan 13, 2022 | 4:55 PM

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు (AP Corona) రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏపీలో గడిచిన 24 గంటల్లో (బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు) 47,884 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..4,348 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా రక్కసి ఇద్దరిని బలి తీసుకుంది. క‌ృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు కోవిడ్‌తో చనిపోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,89,332కి చేరగా.. ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,507గా ఉంది.

కాగా.. గత 24 గంటల్లో 261 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 20,60,621 కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 14,204 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇదిలావుంటే.. ఏపీలోని రెండు జిల్లాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఇందులో చిత్తూరు జిల్లాలో 932 కేసులు నమోదు కాగా.. విశాఖపట్నంలో 823 కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి: UP Assembly Election 2022: సమాజ్ వాదీ పార్టీకి భారీ షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ నాయకుడు..

Career Tips: మీకు అగ్రికల్చర్ సైంటిస్ట్ అవ్వలని ఉందా.. అయితే పూర్తి వివరాలను తెలుసుకోండి