AP Corona Cases: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. కొత్తగా 1,125మందికి పాజిటివ్, 9మంది మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కాస్త తగ్గుముఖం పడుతోంది. వేల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోన్న.. కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.

AP Corona Cases: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. కొత్తగా 1,125మందికి పాజిటివ్, 9మంది మృతి
Coronavirus

Updated on: Sep 14, 2021 | 5:28 PM

Andhra Pradesh Covid19 Cases: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కాస్త తగ్గుముఖం పడుతోంది. వేల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోన్న.. కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 49,568 మందికి పరీక్షలు నిర్వహించారు. 1,125 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,31,974కి చేరింది. గత 24 గంటల్లో కరోనా సోకిన 9 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ బారిన పడి చనిపోయినవారు మొత్తం సంఖ్య 14,019కి చేరింది. 1356 మంది కరోనా వైరస్ మహామ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న మొత్తం సంఖ్య 20,03,543కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,412 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,74,13,209 నమూనాలను ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ పరీక్షించినట్లు తెలిపింది.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈసారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో మరోసారి ఆందోళన నెలకొంది. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో అందరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతాస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శ్రీ సేవలను విస్తృత పరుస్తూ.. ప్రతి ఆసుపత్రిలో 50 శాతం బెడ్స్ కేటాయించాలని ఆదేశించారు. అంతేకాకుండా అత్యాధుని వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

వివిధ జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి… 

Ap Corona Cases

Read Also…  AP CM YS Jagan: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యుత్తమ నిర్వహణ పద్ధతులు.. యాభై శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ పేషెంట్లకేః సీఎం జగన్

Iron Rich Foods: ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారా..! కచ్చితంగా ఈ 5 ఆహారాలను డైట్‌లో చేర్చుకోండి..

Assam Rifles Recruitment: అస్సాం రైఫిల్స్‌లో 1230 పోస్టులు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే.