కరోనా పుణ్యమా అని ఎన్నో వింతలు, విడ్డూరాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరికి తోచిన తరహాలో వారు భౌతిక దూరం నిబంధన పాటించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో డబ్బులు, వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం వంటి రోజు వారి పనులను కూడా చాలా జాగ్రతలు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులతో సోషల్ డిస్టెన్స్‌ను పాటించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇలాంటి ఓ ఘటనను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. బీహార్‌లో ఓ మద్యం షాపు యజమాని అమలు చేస్తున్న కొత్త టెక్నిక్‌ను ఆనంద్ మహీంద్రాను తెగ ఆకట్టుకుంది.
మద్యం షాపులో మద్యం అమ్మేందకు కొత్త పద్దతిని ఏర్పాటు చేసుకున్నాడు యజమాని. దాదాపు 5 అడుగుల పొడవుండే పెద్ద పైపును ఏర్పాటు చేశాడు. ఆ పైపులోకి తాడు కట్టి ఉన్న ఓ బాటిల్‌ను అమర్చాడు. బాటిల్ దాని అంతట అదే జారి కస్టమర్ వైపు చివరకు వెళ్లిపోతుంది. అవసరమైనప్పుడు తాడు సాయంతో దాన్ని తిరిగి వెనక్కు తీసుకోవచ్చు. ఇక మద్యం కొనుగోలు చేయాలనుకున్న వారు ముందుగా ఆ బాటిల్ లో డబ్బులు పెడితే.. యజమాని తాడు సాయంతో గొట్టం ద్వారా బాటిల్ ను వెనక్కు లాగి అందులోని డబ్బు తీసుకుంటాడు. ఆ తరువాత కస్టమర్ కోరిన మద్యాన్ని ఆ గొట్టంలోకి జారవిడిస్తే.. అది వినియోగదారుడి చేతిలోకి వచ్చిపడుతుంది.
మద్యం షాపు యజమాని టెక్నిక్ చూసి ఫిదా అయ్యారు ఆనంద్ మహీంద్రా. ఈ ఐడియాను మరింత నవీకరిస్తే బాగుంటుందని ఓ సలహా కూడా ఇచ్చారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. భవిష్యత్తుల్లో బ్లూటూత్ ఆధారంగా ఈ ఐడియాను మరింత అభివృద్ధి చేస్తారేమో అని అన్నారు.
This clip’s been circulating for a bit. Clever,but crude,so it points to an opportunity for aesthetic ‘contactless’ storefront design. The future is Bluetooth-enabled shelf-browsing+chute-enabled cash exchange & delivery to your waiting hands/car. @PininfarinaSpA @tech_mahindra pic.twitter.com/gGF2jUYs7l
— anand mahindra (@anandmahindra) June 14, 2020