ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఫోన్‌లో అమిత్ షాతోపాటు కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా మాట్లాడారు. పలు కీలక అంశాలను చర్చించినట్లుగా తెలుస్తోంది.
అయితే రేపు(శుక్రవారం) సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా సీఎం జగన్ ను కోరినట్లుగా తెలుస్తోంది. దేశంలో కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ ఎత్తివేత, దేశ ఆర్థిక గమనం, చైనాతో సరిహద్దు ఘర్షణలు వంటి సమస్యలపై కేంద్రం అఖిలపక్ష సమావేశంలో చర్చించనున్నారు.