కరోనా వైరస్.. రేపు ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షా అఖిలపక్ష సమావేశం

| Edited By: Pardhasaradhi Peri

Jun 14, 2020 | 7:19 PM

ఢిల్లీలోను, యూపీ, హర్యానా రాష్ట్రాల లోని కొన్ని ప్రాంతాలలోను కరోనా వైరస్ కు సంబంధించి పరిస్థితిపై హోమ్ మంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లోని..

కరోనా వైరస్.. రేపు ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షా అఖిలపక్ష సమావేశం
Follow us on

ఢిల్లీలోను, యూపీ, హర్యానా రాష్ట్రాల లోని కొన్ని ప్రాంతాలలోను కరోనా వైరస్ కు సంబంధించి పరిస్థితిపై హోమ్ మంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లోని పాలక ఆప్ తో సహా కాంగ్రెస్, బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీల నాయకులు ఈ మీటింగ్ లో పాల్గొంటున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడంపై సుప్రీంకోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించిన విషయాన్ని కూడా ఈ సమావేశంలో ప్రస్తావించవచ్ఛునని తెలుస్తోంది. యూపీ, హర్యానా…. ఢిల్లీతో గల తమ బోర్డర్స్ ని మూసివేసిన అంశాన్ని  కూడా చర్చల్లో ప్రధానంగా ఈ రాష్ట్రాల నేతలు లేవనెత్తనున్నారు. కాగా ఇవాళ ఉదయం అమిత్ షా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో ప్రత్యేకంగా సమావేశమై నగరంలో కరోనా పరిస్థితిపై చర్చించారు. ఈ మీటింగ్ లో కేంద్ర మంత్రి హర్షవర్ధన్, రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ కమిటీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.