‘లక్ష్మీ బాంబ్’ ఎలా ఉంటుందో చెప్పిన అక్షయ్..

|

Jun 30, 2020 | 6:49 AM

Laxmmi Bomb : కరోనా ప్రభావంతో చిత్రపరిశ్రమ మొత్తం లాక్ డౌన్ లోనే ఉండిపోయింది. షూటింగ్ లు నిలిచిపోవడం… కొత్త సినిమాలు విడుదల వాయిదాలు పడటంతో ఇండస్ట్రీ మరో మార్గాన్ని వెతుకుంటోంది. ఇప్పుడు తాజాగా.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన హర్రర్ కామెడీ ఫిల్మ్ ‘లక్ష్మీ బాంబ్’ ఇప్పుడు ఓటీటీలో విడుదల అవుతుంది. వాస్తవానికి ఈ చిత్రం మే 22నే విడుదల కావాల్సింది. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రానికి […]

‘లక్ష్మీ బాంబ్’ ఎలా ఉంటుందో చెప్పిన అక్షయ్..
Follow us on

Laxmmi Bomb : కరోనా ప్రభావంతో చిత్రపరిశ్రమ మొత్తం లాక్ డౌన్ లోనే ఉండిపోయింది. షూటింగ్ లు నిలిచిపోవడం… కొత్త సినిమాలు విడుదల వాయిదాలు పడటంతో ఇండస్ట్రీ మరో మార్గాన్ని వెతుకుంటోంది. ఇప్పుడు తాజాగా..
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన హర్రర్ కామెడీ ఫిల్మ్ ‘లక్ష్మీ బాంబ్’ ఇప్పుడు ఓటీటీలో విడుదల అవుతుంది. వాస్తవానికి ఈ చిత్రం మే 22నే విడుదల కావాల్సింది. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రానికి చెందిన రెండు పోస్టర్స్ ను విడుదల చేశారు.

పోస్టర్స్ విడుదల సందర్భంగా అక్షయ్ మాట్లాడారు… లక్ష్మీ బాంబ్‌లో మానసికంగా ఉద్వేగభరితమైన పాత్ర నాది. ఇటువంటి పాత్ర నేను ఇంతకు ముందెన్నడూ చేయలేదు. నిజంగా చెప్పాలంటే కరెక్ట్ సీన్ కోసం నేను చాలా రీటేక్‌లు తీసుకున్నది కూడా ఇందులోనే… ఈ చిత్రంలో దర్శకుడు రాఘవ లారెన్స్ నాకు కొత్తదనాన్ని అనుభవించే అవకాశాన్ని కల్పించారు.

ఇందులో ట్రాన్స్‌జెండర్ పాత్రను నాతో చేయించిన ఆయనకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పటి వరకు నాకు తెలియని ఒక సంస్కరణకు నన్ను రాఘవ పరిచయం చేశాడు. ఈ చిత్రం మనుషుల్లో విభేదాలపై మరింత అవగాహనను నాకు నేర్పింది. మీకు కావాల్సిన దాని కోసం.. అజ్ఞానంగా, మూర్ఖంగా పొందాలని ప్రయత్నించవద్దు. దయ.. శాంతికి కీలకం అని తెలుసుకోండి” అని వివరించారు.