ఆ ఎంపీ చొరవతో వలస కార్మికులకు విమాన టికెట్లు..

| Edited By: Pardhasaradhi Peri

Jun 03, 2020 | 7:12 PM

ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్ కారణంగా అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌తో స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనందిస్తుండగా...అనేక మంది నేతలు, ప్రముఖులు, వీఐపీలు సైతం వలస కూలీలు, కార్మికుల పట్ల తమ ఉదారతను చాటుకుంటున్నారు.

ఆ ఎంపీ చొరవతో వలస కార్మికులకు విమాన టికెట్లు..
Follow us on

ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్ కారణంగా అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌తో స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనందిస్తుండగా…అనేక మంది నేతలు, ప్రముఖులు, వీఐపీలు సైతం వలస కూలీలు, కార్మికుల పట్ల తమ ఉదారతను చాటుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కూలీలు, కార్మికులను తమ స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులు, విమాన చార్జీలు అందజేస్తున్నారు. తాజాగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ వలస కూలీలకుసాయమందించారు. ఢిల్లీలో చిక్కుకుపోయిన 33 మంది బిహార్‌ వాసులను విమానంలో తీసుకెళ్లేందుకు టికెట్లు బుక్‌ చేశారు.

ఎంపీ కోటాలో తనకు కేటాయించే 34 బిజినెస్‌ క్లాస్‌ టికెట్లను వలస కూలీలు, కార్మికుల కోసం ఎంపీ బుక్‌ చేసినట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యాలయం వెల్లడించింది. . వలస కార్మికులతో పాటు ఎంపీ సంజయ్‌ కూడా గురువారం సాయంత్రం బిహార్‌ వెళ్తారని వెల్లడించింది. ఎంపీ చొరవను ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశంసించారు. ‘దేవుడు ఇతరుల సేవకై పనిచేసే అవకాశాలు ఇచ్చినప్పుడు. వాటిని బాధ్యతగా నెరవేర్చాలన్నారు. ఎంపీ సంజయ్‌ అభినందనీయుడు అని సీఎం కొనియాడారు. ప్రజా సేవకై రాజకీయాల్లోకి వచ్చానని, సీఎం కేజ్రీవాల్‌ సారథ్యంలో ఎప్పుడూ ప్రజా సేవకు అంకితమవుతానని ఎంపీ ట్విటర్‌ ద్వారా బదులిచ్చారు.