Coronavirus: గర్భిణులకు కరోనా సోకితే.. కడుపులో బిడ్డకు కూడా వైరస్‌ వ్యాపిస్తుందా.? తాజా అధ్యయనంలో ఏం తేలిందంటే..

|

Dec 27, 2021 | 8:09 AM

Coronavirus: ప్రపంచాన్ని ఇంతలా భయపెట్టిన వ్యాధి ఏదైనా ఉందా అంటే అది కరోనా ఒక్కటే అని చెప్పడంలో ఎలాంటి సందేహం. యావత్‌ మానవాళిని కంటికి కనిపించని ఓ వైరస్‌ ముప్పుతిప్పలు పెట్టిస్తోంది...

Coronavirus: గర్భిణులకు కరోనా సోకితే.. కడుపులో బిడ్డకు కూడా వైరస్‌ వ్యాపిస్తుందా.? తాజా అధ్యయనంలో ఏం తేలిందంటే..
Follow us on

Coronavirus: ప్రపంచాన్ని ఇంతలా భయపెట్టిన వ్యాధి ఏదైనా ఉందా అంటే అది కరోనా ఒక్కటే అని చెప్పడంలో ఎలాంటి సందేహం. యావత్‌ మానవాళిని కంటికి కనిపించని ఓ వైరస్‌ ముప్పుతిప్పలు పెట్టిస్తోంది. ఈ వైరస్‌లో వెలుగులోకి వచ్చి రెండేళ్లు గడుస్తోన్నా దీని గురించి పూర్తిగా ఎవరు తెలుసుకోలేకపోయారు. ఇప్పటికీ ఈ వ్యాధికి సంబంధించి ఎన్నో అనుమానాలు నివృత్తి కాలేవు. ముఖ్యంగా గర్భిణులకు సంబంధించిన ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి.. గర్భిణులకు కరోనా సోకితే కడుపులో బిడ్డకూ సోకుతుందా? బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కరోనా సోకితే.. తల్లి పాలు తాగే శిశువులు కూడా కరోనా బారిన పడతారా వంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.

అయితే తాజాగా శాస్త్రవేత్తలు ఈ అనుమానలన్నింటినీ నివృత్తి చేశారు. గర్భిణులకు కరోనా సోకితే.. బిడ్డకు వ్యా్ప్తి చెందుతుందా.? అన్న కోణంలో చేసిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. గర్భిణులకు కరోనా ఉన్నా, జన్మించిన బిడ్డకు కరోనా సోకే ప్రమాదం ఉండదని అధ్యయనంలో తేలింది. నార్త్‌ వెస్ట్రన్‌ యూనివర్సిటీ ఫెయిర్‌ బెర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను జర్నల్‌ ఆఫ్‌ పెరెంటల్‌ మెడిసన్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనంలో తేలిన వివరాల ప్రకారం..

కరోనా సోకిన గర్భిణులకు జన్మించిన శిశువుల్లో కరోనా కనిపించలేదని, శిశువు ఆరోగ్యం.. పెరుగుదల సాధారణంగానే ఉందని పరిశోధకులు తెలిపారు. అధ్యయనంలో భాగంగా వ్యాక్సిన్‌ తీసుకోని కొంత మంది గర్భిణులపై ఆరు నెలలపాటు అధ్యయనం చేశారు. వీరిలో 55శాతం మందికి ప్రసవం జరిగిన 10 రోజుల్లోపే కరోనా సోకింది. అయితే, వారికి జన్మించిన శిశువులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఏ ఒక్కరికీ కరోనా పాజిటివ్‌గా రాలేదని పరిశోధకులు తెలిపారు.

Also Read: Shirdi Sai Baba: షిర్డీ సాయిబాబా భక్తులకు అలెర్ట్.. రాత్రి వేళల్లో ఆలయం మూసివేత.. ఎందుకంటే

Andhra Pradesh: వామ్మో! క్రేన్ తెస్తే కానీ పనవ్వలేదు.. వలకు చిక్కిన 750 కేజీల భారీ టేకు చేప

Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..