
మాజీ ఎంపీ మురళీమోహన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. మురళీమోహన్ కుమారుడి ఇంట్లో పని చేస్తున్న ముగ్గురు పని మనుషులకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఇద్దరు భార్యా భర్తలు, కాగా, మరో మహిళ వంట మనిషిగా పని చేస్తోంది. టోలిచౌకికి చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి, బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో నివాసం ఉంటున్న మరో యువతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి(49)కోవిడ్ పాజిటివ్ వచ్చింది. శివాజీనగర్‌కు చెందిన వ్యక్తి గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఉస్మానియా ఆస్పత్రిలో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో శివాజీనగర్‌లోని అతడి కుటుంబ సభ్యులను అధికారులు హోం క్వారంటైన్ చేశారు.