యూపీలో భారీ ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాడు కొత్తగా 499 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4,948 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 8,268 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని యూపీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 60.72 శాతం రికవరీ రేటు ఉందని పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 399 మంది మరణించినట్లు తెలిపారు. శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 15,762 కరోనా టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు. జూన్ చివరి నాటికి రోజుకు 20 వేల టెస్టులు చేసే సామర్ధ్యాన్ని పెంచుటున్నామని ఆరోగ్యశాఖ అధికారి ఒకరు తెలిపారు.ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4,56,213 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు.