శరద్‌ పవార్‌ నివాసంలో కరోనా కలకలం

ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ నివాసంలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. బారామతి జిల్లాలోని గోవింద్ బగ్‌ ప్రాంతంలో ఉన్న ఆయన బంగ్లాలో పనిచేస్తున్న నలుగురు వర్కర్స్‌కు కరోనా సోకింది. అయితే..

శరద్‌ పవార్‌ నివాసంలో కరోనా కలకలం

Edited By:

Updated on: Aug 21, 2020 | 11:25 PM

ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ నివాసంలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. బారామతి జిల్లాలోని గోవింద్ బగ్‌ ప్రాంతంలో ఉన్న ఆయన బంగ్లాలో పనిచేస్తున్న నలుగురు వర్కర్స్‌కు కరోనా సోకింది. అయితే వారి కుటుంబంలో ఎవరికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలలేదన్నారు. ఈ విషయాన్ని బారామతి జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కాగా, మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహరాష్ట్ర నుంచే నమోదవుతున్న సంగతి తెలిసిందే.

Read More :

గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

కేంద్రమంత్రికి పాజిటివ్‌.. క్వారంటైన్‌లోకి హర్యానా సీఎం