ఒడిషాలో రెండు వేలకు చేరువలో కరోనా కేసులు

| Edited By:

May 31, 2020 | 4:50 PM

ఒడిషాలో కరోనా మహమ్మారి రెచ్చిపోతోంది. మొన్నటి వరకు అత్యల్పంగా ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. తాజాగా గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతోంది. తాజాగా ఆదివారం నాడు కొత్తగా మరో 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,948కి చేరింది. ఈ విషయాన్ని ఒడిషా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 889 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. […]

ఒడిషాలో రెండు వేలకు చేరువలో కరోనా కేసులు
Follow us on

ఒడిషాలో కరోనా మహమ్మారి రెచ్చిపోతోంది. మొన్నటి వరకు అత్యల్పంగా ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. తాజాగా గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతోంది. తాజాగా ఆదివారం నాడు కొత్తగా మరో 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,948కి చేరింది. ఈ విషయాన్ని ఒడిషా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 889 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇక 1,050 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి ఏడుగురు మరణించారని పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన ప్రకారం.. ఇప్పటికే 1,82,143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. వీటిలో 89,995 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇక 86,984 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. ఇక కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5,164కు చేరింది.