మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి మొదలు.. ప్రజా ప్రతినిధుల వరకు అంతా కరోనా బారినపడుతున్నారు. మహరాష్ట్రలో ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు కరోనా టెన్షన్ పట్టుకుంది. గడిచిన 24 గంటల్లో 121 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ వచ్చిన పోలీస్ సిబ్బంది సంఖ్య 9 వేలకు చేరింది. వీరిలో కరోనా నుంచి కోలుకుని 7,176 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,939 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 102 మంది మరణించారు.
121 more Maharashtra Police personnel test positive for #COVID19 while 2 died in the last 24 hours, taking the death toll to 102.
Total number of police personnel infected with Corona at 9217, out of which 7,176 have recovered and 1,939 are active cases: #Maharashtra Police pic.twitter.com/QOt4aEdR8i
— ANI (@ANI) July 31, 2020
Read More
కాలుజారి నదిలో పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
తైవాన్ మాజీ అధ్యక్షుడు ఇక లేరు