ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,078 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఒడిషా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి ఐదుగురు మరణించారు. వీరంతా డయాబెటిస్ పేషెంట్లేనని.. అందులో నలుగురు అరవై సంవత్సరాలు దాటిన వారేనని అధికారులు పేర్కొన్నారు. నలుగురు గంజాం జిల్లాకు చెందిన వారు కాగా, ఒకరు కందమాల్ జిల్లాకు చెందిన వారని తెలిపారు. కాగా, రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గంజాం జిల్లాలో జూలై 17వ తేదీ నుంచి జూలై 31 వరకు లాక్‌డౌన్ విధించినట్లు స్టేట్ చీఫ్ సెక్రటరీ అసిత్ త్రిపాఠీ తెలిపారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,835కి చేరింది. వీటిలో ప్రస్తుతం 6,386 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 13,310 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
1078 new COVID19 cases reported in Odisha in the last 24 hours, taking the total number of positive cases in the state to 19,835 including 6387 active cases and 13,309 recovered: State Health Department
— ANI (@ANI) July 22, 2020