కేరళలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు

| Edited By:

Jul 22, 2020 | 7:08 PM

కేరళలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ముఖ్యంగా అన్‌లాక్‌ 1.0 తర్వాత రాష్ట్రంలో కేసుల తీవ్రత పెరిగింది. బుధవారం నాడు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్..

కేరళలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు
Follow us on

కేరళలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ముఖ్యంగా అన్‌లాక్‌ 1.0 తర్వాత రాష్ట్రంలో కేసుల తీవ్రత పెరిగింది. బుధవారం నాడు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,038 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం నమోదైన కేసుల్లో అత్యధికంగా తిరువనంతపురంలో నమోదయ్యాయని.. సీఎం పినరయ్ విజయన్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,818 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించి.. కరోనా కట్టడి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం.