ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య చాపకింద నీరులా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,977 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54,630కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 37,900 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఒడిషా వ్యాప్తంగా 16,353 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఒడిషా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కాగా, దేశ వ్యాప్తంగా రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 24 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 64 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24.61 లక్షలకు చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 17.51 లక్షల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 6.61 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
1,977 new #COVID19 cases, 1,422 new recoveries & 10 deaths reported in Odisha on 13th August. Total number of positive cases in the state stands at 54,630, including 16,353 active cases, 37,900 recovered cases and 324 deaths till date: State Health Department, Odisha
— ANI (@ANI) August 14, 2020
Read More :