RRB Exams 2025: రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రాత పరీక్షలు ప్రారంభం.. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడ్

రైల్వేలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ద్వారా నిర్వహించే పారా మెడికల్‌ పోస్టులకు రాత పరీక్షలు సమీపించాయి. ఈ పరీక్షలకు సంబంధించి ఇటీవల సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లు విడుదలవగా.. తాజాగా హాల్‌ టికెట్లు జారీ అయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..

RRB Exams 2025: రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రాత పరీక్షలు ప్రారంభం.. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడ్
RRB Exams

Updated on: Apr 27, 2025 | 6:57 AM

హైదరాబాద్, ఏప్రిల్ 27: రైల్వే శాఖలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ద్వారా నిర్వహించే పారా మెడికల్‌ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు రేపట్నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్‌టికెట్స్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్‌ కార్డ్స్‌ను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇక ఆర్‌ఆర్‌బీ రాత పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 28 నుంచి 30వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనుంది. భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారా-మెడికల్ పోస్టుల భర్తీకి 2024లో నోటిఫికేషన్‌ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద వివిధ రైల్వే రీజియన్లలో మొత్తం 1376 పారా మెడికల్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

ఆర్‌ఆర్‌బీ పారా మెడికల్‌ 2025 హాల్‌ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఆర్‌ఆర్‌బీ జేఈ ప్రాథమిక కీ విడుదల.. ఏప్రిల్‌ 30లోపు అభ్యంతరాల స్వీకరణ

రైల్వే శాఖలో జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు ఏప్రిల్‌ 22న సీబీటీ 2 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ప్రాథమిక కీ ఇటీవల విడుదలైంది. అభ్యర్థులు రూ.50 చెల్లించి కీ పై అభ్యంతరాలను ఏప్రిల్‌ 30వ తేదీలోపు తెలపవచ్చని బోర్డు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 7951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఆర్‌ఆర్‌బీ జేఈ ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.