TS MBBS Admissions 2023: నేటి నుంచి ఎంబీబీఎస్‌ రెండో రౌండ్‌కు వెబ్‌ ఆప్షన్లు.. ప్రవేశాల రద్దుకు రేపటి వరకు అవకాశం!

|

Aug 30, 2023 | 9:26 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రెండో రౌండ్‌ కౌన్సెలింగ్ ఈ రోజు నుంచి ప్రారంభంకానుంది. ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవల్సిందిగా..

TS MBBS Admissions 2023: నేటి నుంచి ఎంబీబీఎస్‌ రెండో రౌండ్‌కు వెబ్‌ ఆప్షన్లు.. ప్రవేశాల రద్దుకు రేపటి వరకు అవకాశం!
MBBS Admissions
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 30: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రెండో రౌండ్‌ కౌన్సెలింగ్ ఈ రోజు నుంచి ప్రారంభంకానుంది. ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవల్సిందిగా కాళోజీ హెల్త్ వర్సిటీ మంగళవారం (ఆగస్టు 29) ఓ ప్రకటనలో తెల్పింది. బుధవారం (ఆగస్టు 30) ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబరు 1వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోపు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవాలని వర్సిటీ సూచించింది. అలాగే రెండో రౌండ్ కన్వీనర్‌ కోటా కింద ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఖాళీ సీట్ల వివరాలను కూడా వెల్లడించింది.

ఇక కన్వీనర్‌ కోటా కింద మొదటి రౌండ్‌లో ఎంబీబీఎస్‌ సీట్లను దక్కించుకున్న విద్యార్ధులు సంబంధిత కాలేజీలో చేరిన తర్వాత అడ్మిషన్‌ను క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా కాళోజీ హెల్త్ వర్సిటీ అవకాశం కల్పించింది. ఈ మేరకు మొదటి రౌండ్‌లో పొందిన అడ్మిషన్‌ను ఉపసంహరించుకోవడానికి ఆగస్టు 31వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అవకాశం కల్పించింది. అలాగే మొదటి రౌండ్‌లో పొందిన అడ్మిషన్‌ను ఉపసంహరించుకోవడానికి ఎలాంటి అపరాధ రుసుం చెల్లించనవసరం లేదని వర్సిటీ స్పష్టం చేసింది.

ప్రవేశాలు పొందిన విద్యార్ధులు సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్ లకు దరఖాస్తు చేసుకుంటే.. వారి అప్లికేషన్ తోపాటు ఓరిజినల్ సర్టిఫికెట్లు, ఫీజు నగదును వెనక్కి ఇచ్చేయాలని వివరించింది. ఇలా ఖాళీ అయిన సీట్ల వివరాలను ఆగస్టె 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని అన్ని మెడికల్ కాలేజీలను ఆదేశించింది. మొదటి రౌండ్లో మిగిలిపోయిన సీట్లతోపాటు, కాలేజీల్లో ఖాళీ అయిన సీట్లను రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తామని తెల్పింది. అయితే మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందిన తర్వాత వాటిని రద్దు చేసుకున్న విద్యార్థులు తదుపరి రౌండ్‌ల కౌన్సెలింగ్‌కు అనర్హులని స్పష్టంచేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.