WCDSC Hyderabad Jobs 2022: హైదరాబాద్‌ జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎవరు అర్హులంటే..

|

Dec 04, 2022 | 8:22 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌ డిస్ట్రిక్ట్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలోని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్‌లో ఖాళీగా ఉన్న.. 7 ప్రొటెక్షన్ ఆఫీసర్, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్, సోషల్ వర్కర్ తదితర పోస్టుల భర్తీకి..

WCDSC Hyderabad Jobs 2022: హైదరాబాద్‌ జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎవరు అర్హులంటే..
WCDSC Hyderabad
Follow us on

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌ డిస్ట్రిక్ట్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలోని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్‌లో ఖాళీగా ఉన్న.. 7 ప్రొటెక్షన్ ఆఫీసర్, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్, సోషల్ వర్కర్, ఔట్‌రీచ్ వర్కర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్టును బట్టి సోషల్ వర్క్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌/సైకాలజీ స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, ఎమ్‌ఎస్‌డబ్ల్యూ, హోమ్‌సైన్స్‌లో ఎమ్మెస్సీ, ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎమ్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 15, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా సంబంధిత సర్టిఫికెట్లతోపాటు దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. షార్ట్‌ లిస్టింగ్‌, విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు పోస్టును బట్టి రూ.10,400ల నుంచి రూ.27,300ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

The District Welfare Officer, WCD&SC, Hydearabad, Collectorate Premises, 1st Floor, Old Collectorate Building, Nampally Station Road, Abids, Hyderabad-500001.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.