Vizag Steel Plant Trade Apprentice Recruitment 2022 last date: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant)లో 319 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నేడే ఆఖరు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ రోజు (ఆగస్టు 18, 2022వ తేదీ) సాయంత్రం 6 గంటల లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ/ఎన్‌సీబీటీ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏప్రిల్ 1, 2022 నాటికి 18 నుంచి 25 యేళ్ల మధ్య వయసున్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.200లు, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులు రూ.100లు దరఖాస్తు రుసుముగా చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు.
ఖాళీల వివరాలు..
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.