TISS Recruitment 2022: టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
భారత ప్రభుత్వ సంస్థ అయిన ముంబాయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS).. ఒప్పంద ప్రాతిపదికన 9 సీనియర్ రిసెర్చ్ అసోసియేట్/ పోస్ట్-డాక్టోరల్ ఫెలో, జూనియర్ రిసెర్చ్ అసోసియేట్ తదితర..
TISS Mumbai Research Staff Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన ముంబాయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS).. ఒప్పంద ప్రాతిపదికన 9 సీనియర్ రిసెర్చ్ అసోసియేట్/ పోస్ట్-డాక్టోరల్ ఫెలో, జూనియర్ రిసెర్చ్ అసోసియేట్, ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్/ ప్రాజెక్ట్ మేనేజర్, రిసెర్చ్ అసోసియేట్, రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల (Office Administrator Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిగ్రీ, ఎంఫిల్, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 26, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిల్ చేసిన దరఖాస్తులను cete.recruitment@tiss.eduకు ఈమెయిల్ చేయాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్టింగ్ చేసినం వారిని ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు జరిగే ఇంటర్వ్యూలకు ఆహ్వినిస్తారు. అర్హత సాధించినవారు బెంగళూరు, ముంబయి, ఢిల్లీ, లక్నోలలో పనిచేయవల్సి ఉంటుంది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.