UPSC Jobs 2025: నిరుద్యోగులకు భలే ఛాన్స్.. ఎలాంటి రాత పరీక్షలేకుండా యూపీఎస్సీలో 493 ఉద్యోగాలు! రెండు రోజులే గడువు
యూపీఎస్సీ వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 493 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 493 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 12, 2025వ తేదీ తుది గడువులోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీటెక్, ఎల్ఎల్‌బీలో ఉత్తీర్ణతతో పాటు, నోటిపికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.25 చెల్లించాలి. మిగతా కేటగిరీలకు ఎలాంటి ఫీజు లేదు. ఇంటర్వ్యూ, విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.