దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన.. అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటి కమీషనర్, డిప్యూటి డైరెక్టర్, అసిస్టెంట్ కంట్రోలర్, ట్రైనింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన కింద మొత్తం 17 పోస్టులను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీతోపాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు మే 16, 2024వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.25 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. మే 16వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.