UPSC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. పలు ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..

|

Mar 18, 2021 | 1:27 PM

UPSC Recruitment 2021: వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం యూనియన్..

UPSC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. పలు ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..
Upsc Notification
Follow us on

UPSC Recruitment 2021: వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) నోటిఫికేష్‌ను విడుదల చేసింది. ఆసక్తిగల, అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ అయిన UPSC.GOV.IN లో ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తు చేసుకోచ్చు. కాగా, యూపీఎస్పీ ప్రకటించిన నోటిఫికేషన్‌లో లేడీ మెడికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ డిజైన్ ఆఫీసర్, ఇతర పోస్టులు ఉన్నాయి. యుపీఎస్సీ రిక్రూట్‌మెంట్ 2021 పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ముఖ్యమైన తేదీలు:
ఏప్రిల్ 1వ తేదీ రాత్రి 11:59 గంటల లోపు సంబంధిత పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేయాలి.
ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 2, రాత్రి 11.59 గంటల వరకు గడువు ఇచ్చారు.

ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీలు: ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఐదు పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు:
లేడీ మెడికల్ ఆఫీసర్ (ఫ్యామిలీ వెల్ఫేర్)-2,
ప్రిన్సిపల్ డిజైన్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్) -1,
షిప్ సర్వేయర్ కమ్-డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (టెక్నికల్) – 1,
చీఫ్ ఆర్కిటెక్ట్ కార్యాలయంలో పని చేసేందుకు అసిస్టెంట్ ఆర్కిటెక్ట్ – 1.

అర్హతలు..:
లేడీ మెడికల్ ఆఫీసర్ (ఫ్యామిలీ వెల్ఫేర్): నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన యూనివర్సిటీని నుంచి వైద్య విద్య పూర్తి చేసి ఉండాలి. అలాగే ఇంటర్న్‌షిప్ కలిగి ఉండాలి.

ప్రిన్సిపల్ డిజైన్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్): ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థి ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా దానికి సమానమైన డిగ్రీని కలిగి ఉండాలి. దాంతోపాటు.. అభ్యర్థులకు ఓడల రూపకల్పన /ఇన్‌స్టాలేషన్/ నౌకల నిర్మాణంలో పదేళ్ల అనుభవం ఉండాలి.

షిప్ సర్వేయర్ కమ్-డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (టెక్నికల్):
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి నావెల్ ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ కలిగి ఉండాలి. డిగ్రీ కోర్సు అనంతంర షిప్ నిర్మాణం/షిప్ రిపేరింగ్ యార్డు/ షిప్ డిజైన్/ కమ్యూనికేషన్‌లో ఎనిమిది సంవత్సరాల ఆచరణాత్మక అనుభవం ఉండాలి.

అసిస్టెంట్ ఆర్కిటెక్ట్:
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / ఇన్‌స్టిట్యూషన్ నుంచి సమానమైన డిప్లోమా అర్హత కలిగి ఉండాలి. లేదా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేత గుర్తించబడి ఉండాలి. లేదా.. రిజిస్టర్డ్ ఆర్కిటెక్ట్ వద్ద రెండేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి.

ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు UPSC.GOV.IN లో చేక్ చేసుకోవచ్చు.

Also read:

Bizarre Cricket Match: ద్యేవుడా ఇలా కూడా ఆడుతారా!.. నాలుగు బంతుల్లోనే మ్యాచ్ ఫినిష్.. క్రికెట్ చరిత్రలోనే ఇదో వింత రికార్డ్..

బడ్జెట్‌లో పంచాయతీరాజ్ శాఖకు రూ.29, 271 కోట్ల కేటాయింపులు.. మరింత ముమ్మరంగా గ్రామీణాభివృద్ధి-పల్లె ప్రగతి