న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ, ఎన్ఏ) (2) 2023 తుది ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 3) విడుదల అయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. దాదాపు 699 మంది అభ్యర్ధులు తదుపరి పరీక్షలకు ఎంపికయ్యారు. వీరందరికీ వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరీశీలన నిర్వహిస్తారు. కాగా ఎన్‌డీఏ, ఎన్ఏలలో 395 పోస్టులకు గానూ గతేడాది ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి గత ఏడాది సెప్టెంబర్‌లో రాత పరీక్ష నిర్వహించారు. ఎంపిక ప్రక్రియలో ప్రతిభ కనబరచిన వారికి త్రివిధ దళాల విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆయా విభాగాల్లో కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు కల్పిస్తారు.
యూపీఎస్సీ- ఎన్‌డీఏ, ఎన్ఏ(2) 2023 తుది పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. 2023-24 విద్యా సంవత్సరానికిగానూ ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని పేర్కొంది. ఏప్రిల్ 23వ తేదీని చివరి పని దినంగా స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం అంటే 2024-25 విద్యా సంవత్సరం తిరిగి జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతాయని వివరించింది.
తెలంగాణలోని కరీనగర్ జిల్లా వీణవంక మండలం గన్ముకుల ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 7వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 7వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7, 8, 9 తరగతులకు ప్రవేశ పరీక్ష ఉంటుందరి ఆయర పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.