AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Answer Key 2026: మాట నిలబెట్టుకున్న యూపీఎస్సీ.. తొలిసారి రాత పరీక్షల ఆన్సర్‌ కీలు విడుదల! సివిల్స్‌లోనూ ఇదే తరహా

గతంలో తుది ఫలితాల విడుదల తర్వాత మాత్రమే ఆన్సర్‌ కీలను యూపీఎస్సీ విడుదల చేసేది. అయితే పారదర్శకత కోసం ఈ ఏడాది నుంచి పరీక్ష జరిగిన కొద్ది రోజుల్లోనే ఆన్సర్‌ కీలను అందుబాటులో ఉంచింది. దీంతో ఇటీవల జరిగిన UPSC NDA CDS పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది..

UPSC Answer Key 2026: మాట నిలబెట్టుకున్న యూపీఎస్సీ.. తొలిసారి రాత పరీక్షల ఆన్సర్‌ కీలు విడుదల! సివిల్స్‌లోనూ ఇదే తరహా
UPSC NDA CDS Provisional Answer Key
Srilakshmi C
|

Updated on: Apr 18, 2026 | 3:34 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్ 18: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) ఎగ్జామినేషన్ (I) 2026కు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీలను యూపీఎస్సీ విడుదల చేసింది. గతంలో తుది ఫలితాల విడుదల తర్వాత మాత్రమే ఆన్సర్‌ కీలను యూపీఎస్సీ విడుదల చేసేది. అయితే పారదర్శకత కోసం ఈ ఏడాది నుంచి పరీక్ష జరిగిన కొద్ది రోజుల్లోనే ఆన్సర్‌ కీలను అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ 12న ఈ పరీక్ష జరగగా.. ఆన్సర్‌ కీలను అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రాథమిక ఆన్సర్ కీలో ఏవైనా తప్పులు ఉంటే ఆన్‌లైన్ క్వశ్చన్ పేపర్ రిప్రజెంటేషన్ పోర్టల్ (QPRep) ద్వారా ఏప్రిల్ 22లోపు అభ్యంతరాలను తెలిపే అవకాశం కల్పించింది.

యూపీఎస్సీ ఎన్‌డీఏ, సీడీఎస్‌ 2026 ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అభ్యంతరాల స్వీకరణ అనంతరం యూపీఎస్సీ తుది ఆన్సర్ కీలను విడుదల చేస్తుంది. అనంతరం ఫలితాలను వెల్లడిస్తుంది. ఇదే విధానాన్ని యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌ పరీక్షకు కూడా వర్తింపజేయనున్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది. దీంతో యూపీఎస్సీ అభ్యర్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇతర పరీక్షల మాదిరి యూపీఎస్సీ ఆన్సర్ కీలో కూడా తప్పిదాలు ఉంటే అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం లభించినట్లైంది. గతంలో ఫలితాలు ప్రకటన అనంతరం మాత్రమే ఆన్సర్ కీలు విడుదల చేసేవారు.

ఇవి కూడా చదవండి

ఆన్సర్ కీలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సవాల్ చేసి మార్కులు పొందే అవకాశం అభ్యర్ధులకు ఉండేది కాదు. దీంతో వారు మార్కులు కోల్పోవల్సి వచ్చేంది. ఈ ఏడాది నుంచి మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో జరిగే పరీక్షలకు ఫలితాలకు ముందే ఆన్సర్ కీలను కమిషన్ విడుదల చేయనుంది.

యూపీఎస్సీ ఎన్‌డీఏ, సీడీఎస్‌ 2026 ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మాట నిలబెట్టుకున్న UPSC.. తొలిసారి రాత పరీక్షల ఆన్సర్‌ కీ విడుదల
మాట నిలబెట్టుకున్న UPSC.. తొలిసారి రాత పరీక్షల ఆన్సర్‌ కీ విడుదల
30 సెకన్లలో దానిమ్మ గింజలు వేరు చేసే టెక్నిక్.. గోళ్లు నల్లబడవు
30 సెకన్లలో దానిమ్మ గింజలు వేరు చేసే టెక్నిక్.. గోళ్లు నల్లబడవు
ఐపీఎల్ 2026తో ఈ ముగ్గురు టీమిండియా ఆటగాళ్ల కెరీర్ క్లోజ్..?
ఐపీఎల్ 2026తో ఈ ముగ్గురు టీమిండియా ఆటగాళ్ల కెరీర్ క్లోజ్..?
అక్షయ తృతీయ రోజు వాహనం కొనుగోలు చేయడం మంచిదేనా?
అక్షయ తృతీయ రోజు వాహనం కొనుగోలు చేయడం మంచిదేనా?
అబ్బ.. చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
అబ్బ.. చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఖరీదైన కలర్స్‌ వద్దు.. వీటితో హెయిర్ డై చేసి రాసుకుంటే..
ఖరీదైన కలర్స్‌ వద్దు.. వీటితో హెయిర్ డై చేసి రాసుకుంటే..
ఒక్కసారి డిపాజిట్‌ చేస్తే చాలు.. ప్రతి నెలా రూ.9,250 ఆదాయం..!
ఒక్కసారి డిపాజిట్‌ చేస్తే చాలు.. ప్రతి నెలా రూ.9,250 ఆదాయం..!
ప్రవేశ పరీక్షలకు 2026 వేళాయే.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో అనుమతి
ప్రవేశ పరీక్షలకు 2026 వేళాయే.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో అనుమతి
బిగ్ బాస్ వల్ల నాకు తామర వచ్చింది.. రూ. 2 కోట్లు ఇవ్వాల్సిందే
బిగ్ బాస్ వల్ల నాకు తామర వచ్చింది.. రూ. 2 కోట్లు ఇవ్వాల్సిందే
రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం