
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ పోస్టుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఓఆర్‌ఏ పద్ధతిలో భర్తీ చేసే ఈ పోస్టుల కోసం ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 10, 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. కమిషన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ), మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, మైన్స్ మినిస్ట్రీ వంటి వివిధ మంత్రిత్వ శాఖలలో వివిధ పోస్టులను రిక్రూట్ చేస్తుంది. అదనపు అర్హతతో మాస్టర్/గ్రాడ్యుయేట్‌తో సహా నిర్దిష్ట విద్యార్హత కలిగిన అభ్యర్థులు కేంద్ర మంత్రిత్వ శాఖల్లో పని చేసే సువర్ణావకాశాన్ని పొందండి. అయితే ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. నిర్ణీత విద్యార్హతలు, అలాగే మనకు గతంలో ఉన్న పని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటర్వ్యూకు సెలెక్ట్ చేస్తారు.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ లేదా మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ.
సివిల్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా మ్యాథమెటిక్స్ లేదా జియోగ్రఫీ లేదా జియోఫిజిక్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ లేదా సబ్‌డివిజన్ 1(బి)లో సర్వేయర్ల సంస్థ చివరి పరీక్షలో ఉత్తీర్ణత. అయితే వీరు 31.05.2013 వరకు శాశ్వత గుర్తింపు ఉన్న సంస్థలలో నమోదు చేసుకోవాలి.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి అవసరమైన విభాగంలో (అంటే బోటనీ/హార్టికల్చర్/ఆర్గానిక్ కెమిస్ట్రీ) సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానం
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఫిజిక్స్ లేదా జియోఫిజిక్స్ లేదా జియాలజీ లేదా మ్యాథమెటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్‌లో బీఈ లేదా ఏఎంఐఈ ఉత్తీర్ణత ఉండాలి.
మరిన్ని కెరీర్ న్యూస్ కోసం