UPSC CGS Exam 2022: యూపీఎస్సీలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? మరికొన్ని గంటల్లో ముగుస్తున్న ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ..

|

Oct 11, 2022 | 5:07 PM

యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్-2023 ద్వారా భర్తీ చేయనున్న 285 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. మంత్రిత్వశాఖకు చెందిన..

UPSC CGS Exam 2022: యూపీఎస్సీలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? మరికొన్ని గంటల్లో ముగుస్తున్న ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ..
UPSC Recruitment 2022
Follow us on

యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్-2023 ద్వారా భర్తీ చేయనున్న 285 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. మంత్రిత్వశాఖకు చెందిన జియోలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా, జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖకు చెందిన సెంట్రల్ గ్రౌండ్ వాట‌ర్ బోర్డుల్లో ఖాళీగా ఉన్న కేటగిరీ-1, కేటగిరీ-2 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ రోజు (అక్టోబర్‌ 11, 2022) సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు జియోలాజికల్ సైన్స్/జియాలజీ/అప్లైడ్ జియాలజీ/జియో ఎక్స్‌ప్లోరేషన్/మినరల్ ఎక్స్‌ప్లోరేషన్/ఇంజినీరింగ్ అప్లైడ్ జియోఫిజిక్స్/మెరైన్ జియోఫిజిక్స్/అప్లైడ్ జియోఫిజిక్స్/కెమిస్ట్రీ/అప్లైడ్ కెమిస్ట్రీ/అనలిటికల్ కెమిస్ట్రీ/హైడ్రోజియాలజీ విభాగంలో మాస్టర్ డిగ్రీ, అప్లైడ్ జియోఫిజిక్స్‌లో ఎంఎస్సీ(టెక్) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. జనరల్ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ప్రిలిమినరీ, మెయిన్‌ రాత పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ రాత పరీక్ష ఫిబ్రవరి 19, 2023న నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారు మాత్రమే మెయిన్‌ పరీక్షకు అర్హులు. మెయిన్ పరీక్ష జూన్ 24, 25 తేదీల్లో నిర్వహిస్తారు.

ఖాళీల వివరాలు..

ఇవి కూడా చదవండి

కేటగిరీ-1:

  • జియాలజిస్ట్, గ్రూప్-ఎ పోస్టులు: 216
  • జియోఫిజిసిస్ట్, గ్రూప్-ఎ పోస్టులు: 21
  • కెమిస్ట్, గ్రూప్-ఎ పోస్టులు: 19

కేటగిరీ-2:

  • సైంటిస్ట్ ‘బి’(హైడ్రోజియాలజీ), గ్రూప్-ఎ పోస్టులు: 26
  • సైంటిస్ట్ ‘బి’(కెమికల్), గ్రూప్-ఎ పోస్టులు: 1
  • సైంటిస్ట్ ‘బి’(జియోఫిజిక్స్) గ్రూప్-ఎ పోస్టులు: 2

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.