UPSC Civils Mains 2024: మరికాసేపట్లో యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ 2024 పరీక్షలు ప్రారంభం.. పకడ్బందీగా ఏర్పాట్లు

|

Sep 20, 2024 | 8:17 AM

వివిధ అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షలు మరికాసేపట్లో దేశ వ్యాప్తంగా ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా 24 ప్రధాన నగరాల్లో సెప్టెంబర్‌ 20, 21, 22, 28, 29 తేదీల్లో మెయిన్స్‌ జరుగుతాయి. ఇప్పటికే అడ్మిట్‌ కార్డులు విడుదలవగా.. అభ్యర్ధులంతా ఆయా పరీక్ష సెంటర్లకు చేరుకుంటున్నారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మాత్రమే మెయిన్స్‌..

UPSC Civils Mains 2024: మరికాసేపట్లో యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ 2024 పరీక్షలు ప్రారంభం.. పకడ్బందీగా ఏర్పాట్లు
UPSC Civils Mains
Follow us on

హైదరాబాద్‌, సెప్టెంబర్ 20: వివిధ అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షలు మరికాసేపట్లో దేశ వ్యాప్తంగా ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా 24 ప్రధాన నగరాల్లో సెప్టెంబర్‌ 20, 21, 22, 28, 29 తేదీల్లో మెయిన్స్‌ జరుగుతాయి. ఇప్పటికే అడ్మిట్‌ కార్డులు విడుదలవగా.. అభ్యర్ధులంతా ఆయా పరీక్ష సెంటర్లకు చేరుకుంటున్నారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మాత్రమే మెయిన్స్‌ రాసేందుకు అర్హత ఉంటుంది. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 708 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు మొత్తం 9 పేపర్లకు పరీక్ష జరుగుతుంది. అన్ని పేపర్లకు పరీక్ష రాయవల్సి ఉంటుంది. యూపీఎస్సీ

పూర్తి షెడ్యూల్‌ ఇదే..

  • సెప్టెంబర్‌ 20, 2024 తేదీన పేపర్‌-1 ఎస్సే
  • సెప్టెంబర్‌ 21, 2024 తేదీన ఉదయం పేపర్‌-2 జనరల్‌ స్టడీస్‌-1 పరీక్ష, మధ్యాహ్నం పేపర్‌-3 జనరల్‌ స్టడీస్‌-2 పరీక్ష
  • సెప్టెంబర్‌ 22, 2024 తేదీన పేపర్‌-4 జనరల్‌ స్టడీస్‌-3 పరీక్ష, మధ్యాహ్నం పేపర్‌-5 జనరల్‌ స్టడీస్‌-4 పరీక్ష
  • సెప్టెంబర్‌ 28, 2024 తేదీన పేపర్‌-ఎ (ఇండియన్‌ లాంగ్వేజ్‌) పరీక్ష, మధ్యాహ్నం పేపర్‌-బి (ఇంగ్లిష్‌) పరీక్ష
  • సెప్టెంబర్‌ 29, 2024 తేదీన పేపర్‌-6 (ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్‌-1) పరీక్ష, మధ్యాహ్నం పేపర్‌-7 (ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్‌-2) పరీక్ష

సెప్టెంబర్‌ 29న ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్‌ మెయిన్స్‌ పరీక్ష

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌(IBPS)- రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XIII (CRP) ద్వారా ఆఫీసర్‌ స్కేల్‌-1, 2, 3 నియామక ప్రక్రియ కొనసాగుతుంది. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రిలిమ్స్‌ పరీక్ష పూర్తికాగా.. తాజా మెయిన్స్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో సెప్టెంబర్‌ 29న మెయిన్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ వివరాలు నమోదు చేసి, అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మెయిన్‌ ఎగ్జామ్‌ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది.

ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్‌ స్కేల్‌-1 మెయిన్స్‌ అడ్మిట్‌కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్‌ స్కేల్‌-2, 3 మెయిన్స్‌ అడ్మిట్‌కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.