యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు మంగళవారం (డిసెంబర్ 6) విడుదలయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబరు 16 నుంచి 25వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. మెయిన్స్‌కు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 650 మంది వరకు పరీక్షలకు హాజరయ్యారు. వీటికి సంబంధించిన ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 75 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యినట్లు తెలుస్తోంది. దేశం మొత్తం మీద 2,529 మంది అభ్యర్ధులు తదుపరి ఘట్టమైన ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు. ఇంటర్వ్యూ తేదీల వివరాలను త్వరలోనే విడుదల చేస్తామని కమిషన్ పేర్కొంది ఈ ఏడాది 1,011 పోస్టులను వివిధ కేంద్ర సర్వీసులకు భర్తీ చేయనున్నారు.
తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో 16 మందికి శిక్షణ పొందగా.. వారీలో ముగ్గురు అభ్యర్థులు – వరంగల్‌కు చెందిన డి ప్రవీణ్, నిజామాబాద్‌కు చెందిన డి కిరణ్ కుమార్, జనగాం జిల్లాలకు చెందిన కె ప్రణయ్ కుమార్ ఇంటర్వ్యూకు అర్హత సాధించినట్లు ఓ ప్రకటలో వెల్లడించారు. ఇంటర్వ్యూకి అర్హత సాధించిన అభ్యర్థులందరూ డీటెయిల్డ్ అప్లికేషన్‌ను ఫాం-2 (DAF-II)ను తప్పనిసరిగా పూరించవల్సి ఉంటుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.