UPSC CDS II Notification 2022: యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీసెస్ నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం 339 ఖాళీలు..అర్హతలేవంటే..

|

May 18, 2022 | 7:20 PM

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్.. కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్ (UPSC CDS II) 2022కు అర్హులైన అవివాహిత అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

UPSC CDS II Notification 2022: యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీసెస్ నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం 339 ఖాళీలు..అర్హతలేవంటే..
Upsc Cds Ii
Follow us on

UPSC CDS II Notification 2022: యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్.. కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్ (UPSC CDS II) 2022కు అర్హులైన అవివాహిత అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 339

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్ -II 2022

ఖాళీల వివరాలు:

  • ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ, దేహ్రాదూన్ ఖాళీలు: 100
  • ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ, ఎజిమ‌ళ ఖాళీలు: 22
  • ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ, హైద‌రాబాద్ ఖాళీలు: 32
  • ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ, చెన్నై ఖాళీలు: 169
  • ఎస్ఎస్‌సీ విమెన్‌ (నాన్ టెక్నిక‌ల్) ఖాళీలు: 16

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 ఏళ్లు దాటరాదు.

అర్హతలు:

  • ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ, ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ పోస్టులకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ పోస్టులకు ఫిజిక్స్‌, మ్యాథమ్యాటిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధుకు: రూ.200
  • ఎస్సీ/ ఎస్టీ అభ్యర్ధుకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 7, 2022 సాయంత్రం 6 గంటల వరకు.

రాత ప‌రీక్ష తేది: సెప్టెంబర్‌ 4, 2022.

కోర్సు ప్రారంభ తేదీ: జులై 2, 2023.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.