UPSC CDS 1 exam 2022 admit card: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- I 2022కు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదలయ్యాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in.లో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 10న యూపీఎస్సీ సీడీఎస్ రిక్రూట్‌మెంట్ 2022 పరీక్ష దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో జరగనుంది. హాల్ టికెట్లు పోస్ట్ ద్వారా పంపబడవని, వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లలో అభ్యర్ధులకు సంబంధించిన వివరాల్లో ఏవైనా తప్పులు దొర్లితే కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని ఈ సందర్భంగా సూచించింది. కాగా ఈ పరీక్ష ద్వారా మొత్తం 134 పోస్టులు భర్తీకానున్నాయి. అడ్మిట్ కార్డుపై స్పష్టమైన ఫోటోగ్రాఫ్‌లు లేని అభ్యర్థులు పరీక్ష రోజున ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకురావాలి. అంటే ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటరు కార్డ్ మొదలైనవి తీసుకురావచ్చు. పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందు పరీక్ష హాల్‌కు చేరుకోవాలి. ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్షకు సంబంధించిన ఇతర ముఖ్యసమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఈ సందర్భంగా యూపీఎస్సీ సూచించింది.
UPSC CDS admit card 2022లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
Also Read: