UPSC CAPF Interview Letter 2021: కంబైన్డ్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ఇంటర్వ్యూ లెటర్‌ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inని సందర్శించి ఇంటర్వ్యూ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా.. కంబైన్డ్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ 15 ఏప్రిల్ 2021న ప్రారంభమైంది. ఇందులో అభ్యర్థులకు మే 5, 2021 వరకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఇచ్చారు. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ కూడా ఇదే. ఈ ఖాళీకి సంబంధించిన పరీక్ష 8 ఆగస్టు 2021న జరిగింది. దీని ఫలితం 13 నవంబర్ 2021న అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేశారు.
ఇంటర్వ్యూ లెటర్ డౌన్‌లోడ్ చేయడం ఎలా..?
1. ఫలితాన్ని తనిఖీ చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్- upsc.gov.inకి వెళ్లండి.
2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఇచ్చిన రిక్రూట్‌మెంట్ విభాగానికి వెళ్లండి.
3. ఇందులో ఇంటర్వ్యూ లెటర్‌కి వెళ్లండి.
4. ఇప్పుడు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (ACs) ఎగ్జామినేషన్, 2021 లింక్‌పై క్లిక్ చేయండి.
5. ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్‌లో ఇచ్చిన లింక్‌కి వెళ్లండి.
6. లాగిన్ అయిన తర్వాత ఇంటర్వ్యూ లెటర్ ఓపెన్ అవుతుంది.
7. దానిని ప్రింట్ తీసుకోండి.
ఖాళీల వివరాలు
యూపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 209 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) 78, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)లో 13, సీఐఎస్‌ఎఫ్‌లో 69, ఐటీబీపీకి 27, ఎస్‌ఎస్‌బీకి 22 పోస్టులు ఉన్నాయి.