UPSC Recruitment: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు..

|

Dec 27, 2021 | 9:29 AM

UPSC Recruitment 2021: యూనియన్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉన్న పలు పోస్టులను..

UPSC Recruitment: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు..
Follow us on

UPSC Recruitment 2021: యూనియన్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 187 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్‌ కమిషన్‌ (క్రాప్స్‌) 02, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (క్వాలిటీ అస్యూరెన్స్‌) 157, జూనియర్‌ టైం స్కేల్ ఆఫీసర్‌ (సెంట్రల్‌ లేబర్‌ సర్వీస్‌) 17, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (జియాలాజికల్ సర్వే ఆఫ్‌ ఇండియా) 09, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌- 02 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* అసిస్టెంట్‌ కమిషన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో మూడేళ్ల అనుభవం తప్పనిసరి.

* అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత పని అనుభవం ఉండాలి.

* జూనియర్‌ టైం స్కేల్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.

* అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్స్‌ డిగ్రీతో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రిక్రూట్‌మెంట్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 13-01-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Cyber cirme: బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం అంటే జాగ్రత్త.. ఎందుకంటే..

Corona Variants: జింకల వల్ల కరోనా కొత్త వేరియంట్‌..! హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు..

Aha OTT: తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షోకు హోస్ట్‌గా పాపులర్‌ సింగర్‌.. అధికారికంగా ప్రకటించిన ఆహా మేకర్స్‌..