
హైదరాబాద్, జనవరి 17: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో యేటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పరీక్షకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. లక్షలాది మంది యువత పోటీ పడుతుంటారు. అయితే వందల సంఖ్యలో మాత్రమే ఇందులో విజయం సాధిస్తుంటారు. గతేడాది జారీ చేసిన యూపీఎస్సీ CSE 2025 నోటిఫికేషన్ కింద ఇప్పటికే ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు ముగిశాయి.. వీటి ఫలితాలు కూడా తాజాగా వెలువడ్డాయి. త్వరలోనే పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) కూడా జరగనుంది. అయితే ఈ షెడ్యూల్‌లో యూపీఎస్సీ కీలక మార్పు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జనవరి 22న జరగాల్సిన ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.
జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో నిర్వహించే ‘ఫుల్ డ్రెస్ రిహార్సల్’ కారణంగా జనవరి 22వ తేదీన జరగాల్సిన ఇంటర్వ్యూలను రీషెడ్యూల్ చేశారు. ఈ మేరకు కమిషన్ తెలుతూ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. ముఖ్యంగా ఆ రోజు మధ్యాహ్నం షిఫ్ట్‌లో ఇంటర్వ్యూలు ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఈ మార్పు వర్తిస్తుందని తన ప్రకటనలో స్పష్టం చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. 2026 జనవరి 22 మధ్యాహ్నం షిఫ్ట్‌లో జరగాల్సిన ఇంటర్వ్యూ 2026 ఫిబ్రవరి 27 ఉదయం షిఫ్ట్‌కు మార్పు చేశారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పర్సనాలిటీ టెస్ట్ 2025 కొత్త షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.