UPSC Recruitment 2021: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తివివరాలకు యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్.. upsconline.nic.in ని చూడండి.
ఈ నోటిఫికేషన్ ద్వారా 159 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో బీఎస్‌ఎఫ్ 35, సీఆర్‌పీఎఫ్-36, సీఐఎస్‌ఎఫ్ 67, ఐటీబీపీ 20, ఎస్‌ఎస్‌బీ 1 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* గురువారం విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ఇప్పటికే ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. అప్లికేషన్‌లకు చివరి తేది మే5.
* అప్లికేషన్‌లను విత్‌డ్రా చేసుకోవడానికి మే 12 నుంచి 18 వరకు గడువు ఇచ్చారు.
* ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఆయా ఖాళీల ఆధారంగా 20 నుంచి 25 ఏళ్లు ఉండాలి. (ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంది)
* అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా సెలక్ట్ చేస్తారు. రాత పరీక్ష ఆగస్టు 8న జరగనుంది.
* పరీక్ష పత్రంలో రెండు విభాగాలు ఉంటాయి. పేపర్1లో జనరల్ ఎబిలిటీ, ఇంటెలిజెన్సీ అబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. ఇక రెండో పేపర్‌లో జనరల్ స్టడీస్, ఎస్సై ఉంటాయి. తప్పుడు సమాధానాలకు నెగిటివ్ మార్కులు ఉంటాయి.
* అభ్యర్థులు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. (మహిళలు, ఎస్‌సీ, ఎస్టీలకు ఉచితం)
Also Read: SBI Recruitment 2021: ఎస్‌బీఐలో స్పెషల్ కేడర్ ఆఫీసర్, క్లారికల్ కేడర్ పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
Andhra Pradesh: ఏపీలో పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులు ఖరారు… నోటిఫికేషన్ జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ
Telangana Gurukul: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు