UGC NET 2025 Exam Dates: వారంలో యూజీసీ నెట్‌ 2025 రాత పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ- నెట్‌) డిసెంబర్‌ 2025 పరీక్షలను డిసెంబర్‌ 31 నుంచి నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు ఎగ్జాం సెంటర్లకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను యూజీసీ వెబ్‌సైట్‌లో విడుదల..

UGC NET 2025 Exam Dates: వారంలో యూజీసీ నెట్‌ 2025 రాత పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌
UGC NET December 2025 Exams

Updated on: Dec 22, 2025 | 3:20 PM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 22: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్‌) డిసెంబర్‌ 2025 సెషన్ పరీక్షలను డిసెంబర్‌ 31 నుంచి నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు ఎగ్జాం సెంటర్లకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను యూజీసీ వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌ వెబ్ సైట్ లో నమోదు చేసి పరీక్ష నగరాన్ని తెలుసుకోవచ్చు. ఇక పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్‌కార్డులను కూడా విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్‌ను ఇటీవలే ఎన్‌టీఏ విడుదల చేసింది.

షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 31 నుంచి జనవరి 7 వరకు ఆన్‌లైన్‌ విధానంలో యూజీసీ నెట్‌ 2025 డిసెంబర్‌ సెషన్‌ పరీక్షలు జరగనున్నాయి. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 85 సబ్జెక్టులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలను యేటా రెండు సార్లు ఆన్‌లైన్‌లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అర్హత సాధించిన వారికి జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డుతోపాటు యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు, కాలేజీల్లో జూనియర్ లెక్చర్ పోస్టులకు పోటీపడేందుకు, వివిధ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు. ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి.

తెలంగాణ ఏపీపీ పేపర్‌ 1 రాతపరీక్ష ఆన్సర్ కీ విడుదల.. డిసెంబరు 24 వరకు అభ్యంతరాలకు ఛాన్స్‌

తెలంగాణ అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) పేపర్‌ 1 రాత పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్‌ కీని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి తాజాగా విడుదల చేసింది. పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులకు కీపై అభ్యంతరాలు తెలిపేందుకు డిసెంబరు 24వ తేదీ సాయంత్రంలోపు అవకాశం ఉంటుంది. అభ్యంతరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని బోర్డు ఛైర్మన్‌ వివి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఏపీపీ పేపర్‌ 1 రాతపరీక్ష ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.